ఎవరు ఊహించని బిగ్ అనౌన్స్‌మెంట్ వైజయంతి మూవీస్ నుండి వచ్చేసింది. మరి కొద్ది రోజులలో 50 ఏళ్ళు పూర్తి చేసుకోనున్న ఈ సంస్థ తమ ట్విట్టర్‌లో నాగ అశ్విన్‌తో కలిసి ప్రభాస్ పని చేయనున్నట్టు అధికారికంగా ప్రకటన చేసింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ తీస్తున్నట్లు గతంలో ప్రకటించిన వైజయంతి మూవీస్ తాజాగా ఆ ప్రాజెక్ట్‌లో హీరో ప్రభాస్ అని స్పష్టం చేసింది. ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ చిత్రం చేస్తున్న ప్రభాస్ అతి త్వరలోనే నాగ్ అశ్విన్ అండ్ టీంతో కలిసి పని చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. కాగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మించగా, ఈ చిత్రంలో నటించిన కీర్తి సురేష్ నేషనల్ అవార్డ్ దక్కించుకున్న విషయం తెలిసిందే . చివరిగా వైజయంతి మూవీస్ బేనర్‌లో దేవదాస్ అనే చిత్రంతో పాటు మహర్షి సినిమాలు రూపొందాయి.
బిగ్ అనౌన్స్‌మెంట్.. మహానటి డైరెక్టర్‌తో ప్రభాస్